గ్యాంగ్ లీడర్ మొదటి రోజు కలెక్షన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి..
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.
చిత్రంలో నాని నటన, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొంతమేర నెగెటివ్ మార్క్ కనిపించినప్పటికీ డీసెంట్ రిపోర్ట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజే ఈ సినిమా 4.57 కోట్లు వసూలు చేసింది. ఇక ఏయే ఏరియాల్లో ఎంతెంత రాబట్టిందనే వివరాలు చూస్తే..

నైజాంలో 1.67 కోట్లు, సీడెడ్ లో 52 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు, కృష్ణాలో 33 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, తూర్పు గోదావరిలో 52 లక్షలు, పశ్చిమ గోదావరిలో 30 లక్షలు, ఉత్తరాంధ్రలో 62 లక్షలు రాబట్టింది. మొత్తంగా చూస్తే 4.57 కోట్లు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











