Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీక్ జర్నీ ఫినిష్.. ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..
నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్స్ వివరాలు చూస్తే..
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని హీరోగా వచ్చిన తాజా సినిమా 'గ్యాంగ్ లీడర్' కావడంతో విడుదలకు ముంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.28 కోట్ల బిజినెస్ చేసింది.
మొదటివారం కలెక్షన్స్
సెప్టెంబర్ 13 న విడుదలైన గ్యాంగ్ లీడర్ మూవీ నిన్నటితో (గురువారం) మొదటివారం పూర్తి చేసుకుంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18.96 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. 4వ రోజు నుంచి మొదలుకొని కలెక్షన్స్ క్రమంగా తగ్గాయని తెలిసింది.
4వ రోజు నుంచి 7వ రోజు వరకు
4వ రోజు నుంచి 7వ రోజు వరకు గ్యాంగ్ లీడర్ రాబట్టింది కేవలం 2.42 కోట్లు మాత్రమే. క్రమంగా గ్యాంగ్ లీడర్ వసూళ్లు క్షీణించాయి. ఈ వారం పోటీకి వరుణ్ తేజ్ వాల్మీకి కూడా రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పడిపోయే అవకాశముందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఏరియావైస్ కలెక్షన్స్ చూస్తే
నైజాంలో 5.80 కోట్లు, సీడెడ్ 1.81 కోట్లు, కృష్ణా 1.10 కోట్లు, గుంటూరు 1.21 కోట్లు, నెల్లూరు 0.47 కోట్లు, వెస్ట్ గోదావరి 0.85 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.20 కోట్లు, ఉత్తరాంధ్ర 1.90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.50 కోట్లు, ఓవెర్సీస్ 3.12 కోట్లు, మొత్తంగా చూస్తే 18.96 కోట్లు రాబట్టింది గ్యాంగ్ లీడర్.