Nani's గ్యాంగ్ లీడర్ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్, గట్టెక్కే అవకాశం ఉందా?

నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు బావున్నప్పటికీ సోమవారం నుంచి వీక్ డేస్ మొదలు కావడంతో సాధారణంగానే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో 'గ్యాంగ్ లీడర్' చిత్రం ఆశాజనకమైన వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే దాదాపు 60 శాతానికి పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. దీంతో సినిమా ఈజీగా గట్టెక్కుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. సెకండ్ వీకెండ్ నాటికి ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది అనే అంశంపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

Recommended Video

Nani's Gang Leader 3 Days Collections || క్రేజీగా నాని గ్యాంగ్‌లీడర్‌ కలెక్షన్లు !
4 డేస్ కలెక్షన్ ఎంతంటే?

4 డేస్ కలెక్షన్ ఎంతంటే?

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి 4 రోజుల్లో నాని గ్యాంగ్ లీడర్ మూవీ రూ. 13 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా విడుదలైన ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం మంచి మొత్తమే అని అంటున్నారు వ్యాపార విశ్లేషకులు.

నైజాంలో కలెక్షన్లు అదుర్స్

నైజాంలో కలెక్షన్లు అదుర్స్

‘నైజాం' ప్రాంతంలో ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ రూ. 5 కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. సీడెడ్ ఏరియాలో బిజినెస్ కాస్త డల్ ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ ఏరియాలో వసూళ్లు కేకపుట్టించే రేంజిలో ఉన్నాయి.

లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?

లాభాలు రావాలంటే ఇంకా ఎంత రావాలి?

తెలుగు రాష్ట్రాలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 21 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 13 కోట్ల వరకు వసూలయ్యాయి. మరో రూ. 8 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ పాయింటును చేరుకోనుంది. సెకండ్ వీకెండ్ బరిలోకి ‘వాల్మీకి', ‘బందోబస్త్' చిత్రాలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

గ్యాంగ్ లీడర్

గ్యాంగ్ లీడర్

నాని హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. ప్రధాన పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ నటించారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X