Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అదరగొట్టిందిగా... నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్ షో వసూళ్లు!
Recommended Video
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' గ్రాండ్గా విడుదలైంది. సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉండటం, ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో పెద్దగా పోటీ కూడా లేక పోవడంతో యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది. దీంతో డీసెంట్ కలెక్షన్లు నమోదయ్యాయి. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ కలిగిన హీరోల్లో నాని ఒకరు. ఆయన గతంలో నటించిన పలు చిత్రాలు అక్కడ 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. అందుకు కారణం నాని సినిమాలన్నీ యూఎస్ఏ తెలుగువారు ఎక్కువగా ఇష్టపడే ఫీల్ గుడ్ అనేలా ఉండటమే.
ఇద్దరి కాంబినేషన్ కావడంతో క్రేజ్
ఇక దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా గతంలో ‘మనం' సినిమా ద్వారా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద తన సత్తాచాటాడు. అప్పటి నుంచి ఈ డైరెక్టర్ సినిమాలకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇపుడు నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ కావడంతో ‘గ్యాంగ్ లీడర్'కు మంచి ఫైప్ వచ్చింది. అందకే యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ కూడా రూ. 6 కోట్లకు అమ్ముడయ్యాయి.
గ్రాండ్ రిలీజ్
‘గ్యాంగ్ లీడర్' మూవీపై ఏర్పడిన అంచనాలకు తగిన విధంగానే దాదాపు 200 స్క్రీన్లలో యూఎస్ఏ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇండియాలో విడుదలకు ఒక రోజు ముందే అక్కడ భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు వేశారు. అడ్వాన్స్ బుకింగ్ అదే స్థాయిలో జరిగింది. చాలా చోట్లు ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
ప్రీమియర్ షో కలెక్షన్ ఎంతంటే?
యూఎస్ఏ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... నాని కెరీర్లో హయ్యెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించిన 2వ చిత్రంగా ‘గ్యాంగ్ లీడర్' నిలిచింది. 177 లొకేషన్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం $182,679 వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని గత చిత్రం ‘ఎంసీఏ' $304,000 వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.
మరో 1 మిలియన్ మార్క్ మూవీ అవుతుందా?
ప్రీమియర్ షో ద్వారానే దాదాపు 2 లక్షల డాలర్లు రావడంతో.... ఈ చిత్రం ఫుల్ రన్లో 1 మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫస్ట్ వీకెండ్ వచ్చే రెస్పాన్స్ బట్టే ‘గ్యాంగ్ లీడర్' చిత్రానికి ఆ సత్తా ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుందని మరికొందరంటున్నారు.