‘జెర్సీ’ వసూళ్ల ప్రభంజనం, యూఎస్ఏలో కేక... ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్!

Recommended Video

Nani's Latest Jersey Movie Collection Report || Filmibeat Telugu

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' మూవీ సూపర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. శుక్రవారం తొలి ఆట నుంచే బావుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శని, ఆదివారాల్లో థియేటర్లు కిక్కిరిసి పోయాయి.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయం, నాని మూవీలన్నింటిలోకెల్లా నెం.1 స్థానం దక్కించుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు క్రింది విధంగా ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ 3 డేస్ కలెక్షన్

ఏపీ, తెలంగాణ 3 డేస్ కలెక్షన్

బాక్సాఫీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ‘జెర్సీ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ (3 డేస్) రూ. 10.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో వారు పెట్టిన పెట్టుబడిలో సగం రికవరీ అయినట్లయింది.

లాభం రావాలంటే ఇంకా ఎంత రావాలి?

లాభం రావాలంటే ఇంకా ఎంత రావాలి?

ఏపీ, తెలంగాణ అన్ని ఏరియాలకు కలిపి ‘జెర్సీ' చిత్రాన్ని రూ. 20.10 కోట్లకు రైట్స్ అమ్మారు. 3 రోజుల్లోనే రూ. 10.70 కోట్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇపుడు హాలిడే సీజన్ కావడంతో తొలివారం పూర్తయ్యే సరికి టోటల్ రికవరీ అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

ఏరియా వైజ్ షేర్

ఏరియా వైజ్ షేర్

తొలి 3 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 4.92 కోట్ల షేర్, సీడెడ్ రూ. 1 కోటి, ఉత్తరాంధ్ర రూ. 1.31 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 86 లక్షలు, కృష్ణ రూ. 77 లక్షలు, గుంటూరు రూ. 82 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 63 లక్షలు, నెల్లూరు రూ. 36 లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది.

యూఎస్ఏలో ఎక్సలెంట్

యూఎస్ఏలో ఎక్సలెంట్

యూఎస్ఏలో సైతం ‘జెర్సీ' మూవీ అదరగొడుతోంది. శనివారం(ఏప్రిల్ 20) ఒక్కరోజే $318,892 వసూలు చేసింది. ప్రీమియర్ షో కలెక్షన్, శుక్రవారం రాబట్టిన అమౌంట్ మొత్తంతో కలిపితే $726,311 రాబట్టింది. 146 లొకేషన్లలో స్క్రీన్ యావరేజ్ $2,345గా నమోదైంది. ఇంత యావరేజ్ రావడం ఎక్సలెంట్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

నాని ఖాతాలో మరో మిలియన్ డాలర్ మూవీ

నాని ఖాతాలో మరో మిలియన్ డాలర్ మూవీ

ఆదివారం వసూళ్లతో కలుపుకుంటే ‘జెర్సీ' మూవీ అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఇందుకు సంబంధించిన నంబర్స్ వెల్లడి కావాల్సి ఉంది. ఈ మూవీ వసూళ్లు చూస్తుంటే నాని చిత్రాలకు యూఎస్ఏలో మార్కెట్ మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X