Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాక్సాఫీస్ రిపోర్ట్: జెర్సీ ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని దూకుడుపై ఆ ఎఫెక్ట్ పడింది!
Recommended Video
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది నానికి పెద్దగా కలసి రాలేదు. నానికి అర్జెంట్ గా హిట్ అవసరం అన్న తరుణంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జెర్సీ చిత్రానికి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రలో మంచి వసూళ్లు నమోదయ్యాయి. క్రికెట్ నేపథ్యంల్ తెరకెక్కిన ఎమోషనల్ కథ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.
ఎమోషనల్ పెర్ఫామెన్స్
గత ఏడాది నానికి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ లాంటి పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో నాని వైవిధ్యభరితమైన క్రికెట్ నేపథ్యం ఉన్న కథని ఎంచుకున్నాడు. జెర్సీ చిత్రంలో నాని నటన ఎమోషనల్ గా హృదయాన్ని హత్తుకునేలా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు మంచి వసూళ్లు దక్కాయి. ఈ చిత్రంలో నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో
జెర్సీ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 4.4 కోట్ల షేర్ రాబట్టింది. ఇటీవల కాలంలో నాని చిత్రానికి ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. జెర్సీ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో వీకెండ్ వసూళ్లు ఇంకా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసీఏ, నిన్ను కోరి, దేవదాస్ చిత్రాల తర్వాత నాని కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాల్గవ చిత్రంగా జెర్సీ నిలిచింది.
ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ షేర్
జెర్సీ చిత్రం నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలో కలిపి అత్యధికగా తొలి రోజు 2.4 కోట్ల షేర్ రాబట్టింది. మల్టిప్లెక్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సీడెడ్ లో 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 42 లక్షలు, కృష్ణ జిల్లాలో 34 లక్షల షేర్ వసూలు చేసింది. గుంటూరులో 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో 29 లక్షలు రాబట్టడం విశేషం. ఓవర్సీస్ తొలిరోజు వసూళ్లు తెలియాల్సి ఉంది.
కాంచన 3 ఎఫెక్ట్
జెర్సీ చిత్రపై రాఘవ లారెన్స్ కాంచన 3 ఎఫెక్ట్ కొంత పడ్డట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంచన 3 చిత్రానికి మాస్ ఆడియన్స్ మద్దతు దొరుకుతున్నట్లు తెలుస్తోంది. దీనితో కాంచన 3 కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు మంచి వసూళ్లనే రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వీకెండ్ లో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.