twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని 'మజ్ను' కలెక్షన్స్ పై... వర్షం దెబ్బకొట్టిందా? డివైడ్ టాక్ ఎఫెక్ట్ పడిందా?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'మజ్ను' ఇది నా సినిమా అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. సినిమా చూసి ప్రేక్షకులు చాలా ఇంప్రెస్‌ అవుతారు. ప్రేమ, హాస్యం, ఎమోషన్స్‌తోపాట ఒక అందమైన కథ చెప్పాలనే ప్రయత్నం చేశాం. నా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. చిన్నా, పెద్ద అంతా కలిసి నా సినిమా చేస్తారు. కుటుంబం మొత్తం చూసి ఎంజాయ్‌ చేయగల సినిమా ఇది. ' అని నాని ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ చిత్రం రిలీజ్ కు ముందు అన్నారు.

    నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మజ్ను' చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది. మార్నింగ్ షోకో యావరేజ్ టాక్ తెచ్చుకన్న ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ నే వసూలు చేసింది. వీకెండ్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దసగా పరగెట్టే అవకాసం ఉందంటున్నారు. వరస హిట్లతో నానికి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు కలిసి వస్తోంది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ క్రింద చూడండి.

    ఇది మూడో సినిమా

    ఇది మూడో సినిమా

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 2.44 షేర్ వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లో రెండు కోట్లు పైగా తొలి రోజు వసూలు చేసిన చిత్రం . మొదటి రెండు చిత్రాలు ఈగ, జెంటిల్ మెన్.

    వర్షం దెబ్బ కొట్టిందా

    వర్షం దెబ్బ కొట్టిందా

    కేవలం గుంటూరు ఏరియాలో మాత్రమే కొద్దిగా వర్షం ఎఫెక్ట్ కలెక్షన్స్ పై కనపడింది. నైజాం ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వర్షాలు ఎంత ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగుండటం అందరనీ ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. నానీ బాక్సాఫీస్ స్టామినా ఈ సారి ప్రూవ్ అయ్యిందంటున్నారు

    రాజమౌళి తో చేసినప్పుడే

    రాజమౌళి తో చేసినప్పుడే

    రాజమౌళి కాంబినేషన్ లో నాని హీరోగా వచ్చిన ఈగ చిత్రం చేసినప్పుడు మాత్రమే.. తొలి రోజు 1.6 కలెక్ట్ చేసింది. రాజమౌళికు ఉన్న క్రేజ్ , సినిమాపై ఉన్న అంచనాలు, సమంత ఇవన్నీ అప్పుడు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.

    వర్షం లెక్క చెయ్యకుండా

    వర్షం లెక్క చెయ్యకుండా

    మొదటే చెప్పుకున్నట్లు నైజాం ఏరియాలో 1.04 కోట్లు వసూలు చేసింది. వర్షాల ఎఫెక్ట్ ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ పై పూర్తిగా పడుతుందని అంతా భావించారు. కానీ హైదరాబాద్ లో అసలు ఆ ప్రబావమే కనిపించలేదు. చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి ధియోటర్స్. తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సీడెడ్ ప్రాంతంలో ఎంత

    సీడెడ్ ప్రాంతంలో ఎంత

    మజ్ను చిత్రం సీడెడ్ ఏరియాలో తొలి రోజు 26.5 లక్షలు వసూలు చేసింది. ఇక్కడ ఇంకా ఎక్కవ వస్తాయని అంతా అంచనాలు వేసారు. కానీ అక్కడే ఆగింది. నాని కు అక్కడా మంచి క్రేజ్ ఉన్నా, క్లాస్ సినిమా అని ప్రచారం జరగటంతో ఆ రేంజి దాటలేకపోయింది.

    ఇక్కడ పూర్తిగావర్షం దెబ్బే

    ఇక్కడ పూర్తిగావర్షం దెబ్బే

    నిజానికి గుంటూరు ఏరియాలో నాని సినిమాలకు ఇంతకు ముందు కలెక్షన్స్ బాగున్నాయి. కానీ గుంటూరులో వర్షం భీబత్సం సృష్టించింది. దాంతో అక్కడ తొలి రోజు కలెక్షన్స్ ఆశించిన స్దాయిలో నమోదు చెయ్యలేదు. 24 లక్షలు మాత్రమే వచ్చాయి.

    ఈ మూడు ఏరియాలు...

    ఈ మూడు ఏరియాలు...

    ఇక మజ్ను చిత్రం ఉత్తరాంధ్ర తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే...24 లక్షలు షేర్ వచ్చింది. అలాగే..ఈస్ట్ గోదావరి 18.3 లక్షలు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 15.3 లక్షలు తొలి రోజు కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

    నెల్లూరు

    నెల్లూరు

    మజ్ను చిత్రం వెస్ట్ గోదావరి... 20.4 లక్షలు తొలి రోజు షేర్ వసూలు చేసింది. అలాగే నెల్లూరు ఏరియా తొలి రోజు షేర్ 11.2 లక్షలు వచ్చాయి. ఈరెండు ఏరియాలు నానికి స్ట్రాంగ్ ఫాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఈస్ట్ , వెస్ట్ లలో నానికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది.

    ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే...

    ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే...

    నాని గత చిత్రాలు జెంటిల్ మెన్ తొలి రోజు 2.1 షేర్ వసూలు అయితే, భలే భలే మొగాడివోయ్...1.73 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మజ్ను చిత్రం 2.44 కోట్లు వసూలు చేసి నాని సినిమా అంటే ఎదురుచూసే అబిమానుల ఎంత మేరకు ఉన్నారనే విషయం తెలియచేసింది.

    సినిమాని నమ్మి చేసాడు

    సినిమాని నమ్మి చేసాడు

    నాని మాట్లాడుతూ ''ప్రేమకథల్లో నటించాలని ఎప్పట్నుంచో ఉంది. నాకు ఇష్టమైన విరించివర్మ వచ్చి ప్రేమకథ చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. ఒక నిజాయతీతో కూడిన కథతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూసుకొన్నాక చాలా సంతృప్తి కలిగింది. 'మజ్ను' నా సినిమా అని చెప్పుకోవడానికి గర్వపడతా. గోపీసుందర్‌ సంగీతం, మిర్చి కిరణ్‌ సంభాషణలు, విరించివర్మ దర్శకత్వ శైలి చిత్రానికి ప్రధాన బలం. 'మజ్ను' విజయం సాధించబోతోంది'' అన్నారు.

    నాని ఉన్నాడు కాబట్టే...

    నాని ఉన్నాడు కాబట్టే...

    సినిమాకు సెకండాఫ్ బాగా వీక్ గా ఉందని టాక్ రావటం కొంత వరకూ మైనస్ అయ్యిందనే చెప్పాలి. సినిమాపై ఉన్న అంచనాలు కొంత కాపాడినా, రొటీన్ కథ,కథనం సినిమాకు మైనస్ గా నిలిచాయనేది నిజం. నాని మాత్రం వన్ మ్యాన్ షోలా లాక్కెళ్లడు. నాని లేకపోతే మరే హీరో ఈ సినిమాని నిలబెట్టలేనంత బాగా చేసాడు.

    సక్సెస్ కోసం ఒకటయ్యారు వీరంతా

    సక్సెస్ కోసం ఒకటయ్యారు వీరంతా

    ఆనంది క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి. కిరణ్‌, గోళ్ల గీత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్స్ గా నటించారు. వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, మనీషా తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌, సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి.

    English summary
    Nani's Majnu has taken a good opening with a share of 2.44 Cr on it’s day1 in Telugu States
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X