నాని ‘పైసా’రిలీజ్ డేటిచ్చారు
హైదరాబాద్: ఎంతో కాలంగా విడుదలకు నోచు కోకుండా వాయిదాలు పడుతూ వస్తున్న 'పైసా' చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది.
కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.
అలాగే... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.
నిర్మాత మాట్లాడుతూ ''పేరుకు తగ్గట్టుగా పైసా వసూల్ సినిమా ఇది. టిక్కెట్టు రేటుకు తగిన వినోదం గిట్టుబాటు అవుతుంది. కృష్ణవంశీ శైలిలోనే విభిన్నంగా సాగే ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.
హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజారవీంద్ర.


Click it and Unblock the Notifications












