శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. తక్కువ టైంలోనే స్టార్‌డమ్‌ను కూడా అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం అతడికి దక్కడం లేదు. దీంతో వరుస సినిమాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడిది ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఆ సంగతులు మీకోసం!

Recommended Video

Acharya Praises Shyam Singha Roy | Nani Priceless Moments With Megastar | Filmibeat Telugu
శ్యామ్ సింగ రాయ్‌గా నాని రచ్చ

శ్యామ్ సింగ రాయ్‌గా నాని రచ్చ


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. దీన్ని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి సూపర్ హిట్ అయింది.

ఈ సినిమాకు వచ్చిన లాభాలిలా

ఈ సినిమాకు వచ్చిన లాభాలిలా

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 26.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటుకుంది.

అలా వచ్చి.. ఇలా ముగిసిందిగా

అలా వచ్చి.. ఇలా ముగిసిందిగా


చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న నేచురల్ స్టార్ నాని చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, ఈ మధ్య కలెక్షన్లు క్రమంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 21 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్టీమింగ్ మొదలైంది.

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ స్థాయి రెస్పాన్స్

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ స్థాయి రెస్పాన్స్


క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అదే సమయంలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక, థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో చేరిందిది.

ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్

ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్


నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని దాని కంటే ఎక్కువే రెస్పాన్స్ సొంతం అయింది. ఫలితంగా ఇది మొదటి వారంలో ఎక్కువ మంది వీక్షించిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో 'అల.. వైకుంఠపురములో' తర్వాత మరోసారి సత్తా చాటిన తెలుగు సినిమాగా పేరు సంపాదించుకుంది.

ప్రపంచంలో మూడో స్థానం కూడా

ప్రపంచంలో మూడో స్థానం కూడా

'శ్యామ్ సింగ రాయ్' మూవీ తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల (నాన్ ఇంగ్లీష్) జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఇండియా నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. నేచురల్ స్టార్ నాని ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవడంతో ఆయన అభిమానులు గర్వంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X