Shyam Singha Roy Collections: 22 కోట్ల టార్గెట్.. రెండు వారాల్లోనే అన్ని కోట్లు.. లాభాలు ఎంతంటే!
సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తూ నేచురల్ స్టార్‌గా పేరును సంపాదించుకున్నాడు నాని. అతడి మూవీలు ఎలా ఉన్నా నటన పరంగా అందరినీ అలరిస్తున్నాడు. అయితే, నాని గత రెండు సినిమాలూ థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలయ్యాయి. దీంతో అతడి అభిమానులే కాదు.. సినీ ప్రియులంతా ఫీల్ మిస్సయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన ఈ యంగ్ హీరో.. 'శ్యామ్ సింగ రాయ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రెండు వారాల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే ‘శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి హిట్‌గా నిలిచింది.

నాని సినిమా బిజినెస్ వివరాలివే
నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్' రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 14 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 114.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల మేర వ్యాపారం జరిగిందట.

14వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. అయితే, రోజులు గడుస్తోన్న కొద్దీ ఈ సినిమా ప్రభావం పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10 లక్షలే రాబట్టింది.

14 రోజులకూ కలిపి వచ్చిందింత
‘శ్యామ్ సింగ రాయ్'కు 14 రోజులకు కలిపి భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.14 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.09 లక్షలు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.17 కోట్లు, కృష్ణాలో రూ. 96 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 18.82 కోట్లు షేర్, రూ. 32 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులకు రూ. 18.82 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.58 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రెండు వారాలకు రూ. 25.30 కోట్లు షేర్, రూ. 44.30 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
Recommended Video

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?
వైవిధ్యమైన కథతో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు వారాల్లోనే రూ. 25.30 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.80 కోట్లు లాభాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











