Shyam Singha Roy Collections: ఆదివారం నాని మూవీ అరాచకం.. పది రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా సక్సెస్ కోసం పాటు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ స్టార్ హీరో 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆరంభం నుంచే మంచి టాక్‌తో కలెక్షన్లు కూడా రాబడుతోంది. దీంతో తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాట పట్టింది. మరి ఈ సినిమా 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Recommended Video

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని
నాని - రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా
నాని మార్కెట్ ప్రకారం.. శ్యామ్ సింగ రాయ్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 110.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వరకూ వ్యాపారం జరిగింది.

10వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?
'శ్యామ్ సింగ రాయ్' మూవీకి 10వ రోజు కలెక్షన్లు కొంత తగ్గినా కోటికి పైగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్‌లో రూ. 10 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.12 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజులకూ కలిపి వచ్చిందింత
10 రోజులకు కలిపి 'శ్యామ్ సింగ రాయ్'కు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.09 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.05 లక్షలు, వెస్ట్‌లో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 1.13 కోట్లు, కృష్ణాలో రూ. 91 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.29 కోట్లు షేర్, రూ. 31.03 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకు రూ. 18.29 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.48 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 10 రోజుల్లోనే రూ. 24.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 43 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 24.57 కోట్లు వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.07 కోట్లు లాభాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











