Shyam Singha Roy Collections: నాని మూవీకి దారుణమైన కలెక్షన్లు.. 12 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
అప్పుడెప్పుడో వచ్చిన 'జెర్సీ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి థియేటర్లలో విడుదల కాగా.. మిగిలిన రెండు మాత్రం నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్' అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభం నుంచే మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఫలితంగా టార్గెట్ కూడా ఫినీష్ అయింది. మరి ఈ సినిమా 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును ఓ సారి చూద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని
నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా
'శ్యామ్ సింగ రాయ్'కు అన్ని చోట్లా మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 12 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 12 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 112.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు తెలిసింది.

12వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?
'శ్యామ్ సింగ రాయ్' మూవీకి 12వ రోజు ఏపీ తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 14 లక్షలు షేర్, రూ. 22 లక్షలు గ్రాస్ వచ్చింది.

12 రోజులకూ కలిపి వచ్చిందింత
'శ్యామ్ సింగ రాయ్'కు 12 రోజులకు కలిపి భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.12 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.07 లక్షలు, వెస్ట్‌లో రూ. 83 లక్షలు, గుంటూరులో రూ. 1.15 కోట్లు, కృష్ణాలో రూ. 94 లక్షలు, నెల్లూరులో రూ. 63 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.60 కోట్లు షేర్, రూ. 31.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
ఏపీ తెలంగాణలో 12 రోజులకు రూ. 18.60 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.83 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.52 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 24.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.66 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
Recommended Video

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?
వైవిధ్యమైన కథతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పన్నెండు రోజుల్లోనే రూ. 24.95 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.45 కోట్లు లాభాలను అందుకుంది.


Click it and Unblock the Notifications











