twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shyam Singha Roy Collections: మరింత పడిపోయిన కలెక్షన్లు.. మొత్తంగా వచ్చిన లాభం ఎంతంటే!

    |

    టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రతి దానిలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలి కాలంలో అతడు నటించిన రెండు సినిమాలూ ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు వారాల క్రితం 'శ్యామ్ సింగ రాయ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టి హిట్ అయింది. అయితే, ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 13 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    Recommended Video

    Shyam Singha Roy Success Meet | Filmibeat Telugu
    నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్‌గా

    నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్‌గా

    నేచురల్ స్టార్ నాని - రాహుల్ సంకృత్యన్ కలయికలో వచ్చిన చిత్రమే ‘శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి విజయం సాధించింది.

    Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్

    నాని సినిమా బిజినెస్ జరిగిందిలా

    నాని సినిమా బిజినెస్ జరిగిందిలా

    నాని మార్కెట్‌కు అనుగుణంగా ‘శ్యామ్ సింగ రాయ్‌'కు రైట్స్ అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 13 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 113.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

    13వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    13వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    నాని నటించిన వైవిధ్యమైన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. అయితే, రోజులు గడుస్తోన్న కొద్దీ ఈ సినిమాకు క్రమంగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 13వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 12 లక్షలే వచ్చాయి.

    ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

     13 రోజులకూ కలిపి వచ్చిందింత

    13 రోజులకూ కలిపి వచ్చిందింత

    13 రోజులకు కలిపి ‘శ్యామ్ సింగ రాయ్'కు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.13 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.08 లక్షలు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 95 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.72 కోట్లు షేర్, రూ. 31.77 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ఏపీ తెలంగాణలో 13 రోజులకు రూ. 18.72 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.86 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.54 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 13 రోజుల్లోనే రూ. 25.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 44 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పదమూడు రోజుల్లోనే రూ. 25.12 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.62 కోట్లు లాభాలను అందుకుంది.

    English summary
    Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. This Movie Collects Rs 25.12 Crores in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X