Shyam Singha Roy Collections: నానికి షాక్.. 6వ రోజు పడిపోయిన కలెక్షన్స్.. అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చి.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు నాని. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేసే అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత మాత్రం ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. మధ్యలో పలు చిత్రాలు చేసినా.. అవి ఓటీటీలో విడుదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ మూవీ వసూళ్లు పడిపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టును మీరూ చూడండి!

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాని సినిమా ప్రి బిజినెస్ డీటేల్స్
నాని 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అన్ని ఏరియాల రైట్స్‌కు పోటీ ఏర్పడింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల బిజినెస్ జరిగింది.

ఆరవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా
విభిన్నమైన కథతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఆరవ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 42 లక్షలు షేర్, రూ. 68 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకూ కలిపి వసూళ్లిలా
'శ్యామ్ సింగ రాయ్'కు ఆరు రోజులకు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.67 కోట్లు, ఈస్ట్‌లో రూ. 77 లక్షలు, వెస్ట్‌లో రూ. 62 లక్షలు, గుంటూరులో రూ. 92 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 48 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. 14.61 కోట్లు షేర్, రూ. 24.78 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
ఏపీ తెలంగాణలో ఆరు రోజులకు రూ. 14.61 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.36 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి నాని సినిమా ఆరు రోజుల్లోనే రూ. 20.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.28 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 20.47 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.03 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

ఆరో రోజు నాని మూవీకి బిగ్ షాక్
నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంగళవారం పుష్ప మూవీ కంటే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. అయితే, బుధవారం మాత్రం నాని సినిమాకు సగానికి సగం వసూళ్లు తగ్గిపోయాయి. దీంతో నాని సినిమాకు ఆరవ రోజు భారీ షాక్ తగిలినట్లైంది.


Click it and Unblock the Notifications











