Shyam Singha Roy Collections: 22 కోట్ల టార్గెట్.. వారం రోజుల్లో భారీగా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

కొంత కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన చివరి రెండు సినిమాలూ ఓటీటీలోనే విడుదలయ్యాయి. దీంతో అటు ప్రేక్షకులకు, ఇటు అతడి అభిమానులకు మజా మాత్రం దొరకలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా థియేటర్లలో గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయిపోయాడతను. ఇందులో భాగంగానే ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్' అనే విభిన్న తరహా చిత్రంతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆరంభం నుంచే మంచి టాక్‌తో ఆడియెన్స్ స్పందనను అందుకుంటోంది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. మరి ఈ సినిమా వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని

నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన విలక్షణమైన సినిమానే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా గ్రాండ్‌గా విడుదల అయింది.

నాని సినిమా ప్రి బిజినెస్ ఎంత?

నాని సినిమా ప్రి బిజినెస్ ఎంత?


నాని మార్కెట్‌ను బట్టి 'శ్యామ్ సింగ రాయ్'కు అన్ని ఏరియాల్లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 7 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వ్యాపారం అయింది.

ఏడో రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

ఏడో రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా


పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి 7వ రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

వారం రోజులకూ కలిపి వసూళ్లిలా

వారం రోజులకూ కలిపి వసూళ్లిలా


'శ్యామ్ సింగ రాయ్'కు వారం రోజులకు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.70 కోట్లు, ఈస్ట్‌లో రూ. 80 లక్షలు, వెస్ట్‌లో రూ. 64 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 73 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 7 రోజుల్లో రూ. 14.92 కోట్లు షేర్, రూ. 25.28 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?


ఏపీ తెలంగాణలో 7 రోజులకు రూ. 14.92 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.38 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 20.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.82 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 20.80 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.70 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X