సరికొత్త ప్రయోగానికి నాని శ్రీకారం: రిలీజ్ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి అలాంటి వీడియో

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నాని. అసాధారణమైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్న అతడు.. హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటాడు. అదే సమయంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఇలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. ఇక, ఆ మధ్య 'జెర్సీ'తో భారీ హిట్‌ను అందుకున్న నాని.. ఆ తర్వాత అలాంటి విజయం కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగానే వచ్చిన 'గ్యాంగ్ లీడర్' మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిరాశే ఎదురైంది.

ఈ మధ్య కాలంలో నాని వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'V'తో పాటు శివ నిర్వాణ రూపొందించిన 'టక్ జగదీష్' మూవీలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. వీటికి అందులో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ అతడి అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి గట్టిగా కొట్టాలన్న పట్టుదలతో నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యన్ వైవిధ్యమైన కథతో తెరకెక్కించాడు.

Nanis Shyam Singha Roy Post Release Theatrical Trailer Released

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీనికితోడు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరించారు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌తో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి పోస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో దేవదాసి అయిన సాయి పల్లవిని.. శ్యామ్ సింగ రాయ్ పాత్ర పోషించిన నాని ఎలా కాపాడాడు? వీళ్లిద్దరి మధ్య బంధం ఎలా బలపడింది? వీళ్ల కథ చివరికి ఎలా ముగిసింది? అనేవి చూపించారు. దీంతో ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక, ఆరంభంలోనే మంచి టాక్‌ను అందుకున్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇలా శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.17 కోట్లు వసూలు చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.45 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 9 రోజుల్లోనే రూ. 23.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 40.50 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు లాభాలు కూడా వచ్చాయి.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్‌లో రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదలై దూసుకుపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X