నాని 'సెగ' టేబుల్ ప్రాఫెట్!?
ఈ శుక్రవారం విడుదల కానున్న నాని తాజా చిత్రం సెగ మార్కెట్ పై అందరి కళ్ళూ ఉన్నాయి. అలా మొదలైంది పెయిర్ నటించటంతో ఈ సినిమాలో ట్రేడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ కోటి నలభై లక్షలు ప్రాపెట్ లో ఉన్నారని చెప్తున్నారు.ఈ చిత్రం బడ్జెట్ చాలా తక్కువగా అంటే కేవలం రెండు కోట్ల నలభై లక్షలు మాత్రమే అయిందని, అందుకే నిర్మాతలు హ్యాపీగా ఉన్నారని ట్రేడ్ రిపోర్టు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకురాలు అంజన మాట్లాడుతూ 'కుర్రకారు అంటేనే ఆవేశం. సముద్ర కెరటాల్లా పారే వయసు, మనసు ఎప్పుడూ ఉప్పొంగిపోతూనే వుంటుంది. అనుభవలేమి వల్లనో, వయసు తొందరపాటు వల్లనో ఆవేశపూరిత నిర్ణయాలకు పాల్పడుతుంటారు. అలాంటి నిర్ణయాలు మున్ముందు జీవితంలో పెను మార్పులకు కారణబూతమవుతుంటాయి. ఈ నేపధ్యంలో నే సెగ సినిమా అవుంతుంది. క్లాస్ మాస్ గా వర్గీకరించలేని అత్యద్భుత కదాంశమిది' అన్నారు. రిలీజ్ కు ముందు లాభాలు తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏంటనేది రేపు ఈ పాటికి తేలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











