Shyam Singha Roy Day 11 collections: భారీగా పడిపోయిన కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంతంటే?

నాచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో తన మార్కెట్ను పెంచుకునే విధంగా సినిమాలను చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక తన కెరీర్ లోనే మొదటి సారి ఒక సరికొత్త ప్రయోగం చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ లోనే ప్రధానమైన మలయాళం కన్నడ తమిళం మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తూ శ్యామ్ సింగ్ సినిమాను భారీగా విడుదల చేశారు. ఇక ఈ సినిమా పది రోజుల వరకు బాగానే వసూళ్లను అందుకుంది. ఇక 11వ రోజు ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి.

 మంచి సక్సెస్

మంచి సక్సెస్

నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ గా సాయిపల్లవి నటించిన విధానంపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. సినిమాలో కృతి శెట్టి పాత్ర ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

నాని గత సినిమాల ప్రభావం శ్యామ్ సింగ రాయ్‌పై పెద్దగా కనిపించలేదు. బిజినెస్ పరంగా డిమాండ్ గట్టిగానే ఏర్పడింది. ఇక ఏరియాల వారిగా జరిగిన బిజినెస్ ఈ విధంగా ఉంది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 10 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 110.50 కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వరకూ బిజినెస్ చేసినట్లు సమాచారం.

 11వ రోజు కలెక్షన్లు..

11వ రోజు కలెక్షన్లు..

శ్యామ్ సింగ రాయ్ మూవీకి 11వ రోజు కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మొన్నటివరకు కోటికి పైగానే వసూళ్లు రాగా నిన్నటితో ఒక్కసారిగా లక్షల్లోకి పడిపోయింది. 11వ రోజు నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 4లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్ష, వెస్ట్‌లో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 0.17 కోట్లు షేర్, రూ. 0.32 కోట్లు గ్రాస్ వచ్చింది.

 11 రోజుల మొత్తం వసూళ్ళు

11 రోజుల మొత్తం వసూళ్ళు


11 రోజుల్లో మొత్తంగా 'శ్యామ్ సింగ రాయ్'కు నైజాంలో రూ. 9.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.10 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.06 లక్షలు, వెస్ట్‌లో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 1.14 కోట్లు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.46 కోట్లు షేర్, రూ. 31.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..


ఏపీ తెలంగాణలో 11 రోజుల్లో రూ. 18.46 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్.. మిగిలిన ఏరియాల్లో కూడా బాగానే రాబట్టింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.81 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా ఈ సినిమా 11 రోజుల్లో రూ. 24.77 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.37 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

ప్రాఫిట్స్ ఎంతంటే?

ప్రాఫిట్స్ ఎంతంటే?

శ్యామ్ సింగ రాయ్' మూవీ క్రిస్మస్ సెలవులు అలాగే న్యూ ఇయర్ బాగా కలిసొచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు టాక్ వచ్చింది. శ్యామ్ సింగరాయ్ 22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో పోటీలోకి రాగా 11 రోజుల్లోనే రూ. 24.77 కోట్లు షేర్ వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.27 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకు సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X