Shyam Singha Roy's Day 4 Collections.. 60 శాతం పడిపోయిన కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద స్టడీగా శ్యామ్ సింగరాయ్

టాలీవుడ్‌లో తొలి చిత్ర నిర్మాతగా బోయినపల్లి వెంకట్ రూపొందించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వారాంతం వరకు మంచి ఫలితాన్ని రాబట్టింది. అయితే బాక్సాఫీస్‌ వసూళ్లకు అగ్ని పరీక్షగా మారే సోమవారం నాడు మాత్రం భారీగా కలెక్షన్లు క్షీణించాయి. అయితే ఆశాజనకంగానే కలెక్షన్లు ఉండటం ఊరటగా మారింది. 4వ రోజు శ్యామ్ సింగరాయ్ సినిమా ఎంత వసూలు చేసింది? లాభాల్లోకి రావాలంటే ఎంత చేయాల్సి ఉంటుంది అనే విషయంలోకి వెళితే..

శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్

శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్

శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 8 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రా 6 కోట్లు (అంచనా) తో కలిపి ఏపీ, తెలంగాణలో 16.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 3.5 కోట్లతో మొత్తంగా 22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా 22.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ వేట మొదలుపెట్టింది.

4వ రోజున వసూళ్లు ఇలా..

4వ రోజున వసూళ్లు ఇలా..

ఇక శ్యామ్ సింగరాయ్ నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 73 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షలు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో 1.38 కోట్లు నికరంగా, 2.45 కోట్లు గ్రాస్ వసూళ్లను నాలుగో రోజున రాబట్టింది. 3వ రోజు వసూళ్లను పోల్చితే.. 60 శాతం కలెక్షన్లు క్షీణించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

శ్యామ్ సింగరాయ్ నాలుగు రోజుల కలెక్షన్లు

శ్యామ్ సింగరాయ్ నాలుగు రోజుల కలెక్షన్లు

గత నాలుగు రోజుల్లో శ్యామ్ సింగరాయ్ చిత్రం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 6.90 కోట్లు, సీడెడ్‌లో 1.82 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.55 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 68 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 లక్షలు, గుంటూరులో రూ.86 లక్షలు, కృష్ణా 64 లక్షలు, నెల్లూరు జిల్లాలో 43 లక్షలతో 13.45 కోట్లు నికరంగా, 22.90 కోట్లు 22.90 కోట్లు రాబట్టింది.

రోజు వారీగా శ్యామ్ సింగరాయ్ సాధించిన వసూళ్లు

రోజు వారీగా శ్యామ్ సింగరాయ్ సాధించిన వసూళ్లు

శ్యామ్ సింగరాయ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజున 4.17 కోట్లు, రెండో రోజున 4.38 కోట్లు, మూడో రోజున 3.52 కోట్లు, నాలుగో రోజున 1.38 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 13.45 కోట్లు నికరంగా, 22.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగేతర రాష్ట్రాల్లో

తెలుగేతర రాష్ట్రాల్లో

నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా భారీగానే వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో 2.40 కోట్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో 550,000 అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.4.11 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్ చిత్రం 17.13 కోట్లు నికరంగా, 30.35 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
శ్యామ్ సింగరాయ్ లాభాల్లోకి రావాలంటే..

శ్యామ్ సింగరాయ్ లాభాల్లోకి రావాలంటే..

నాని, సాయి పల్లవి విభిన్నమైన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం 22.5 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ పరుగును ప్రారంభించింది. ఇప్పటి వరకు 17.13 కోట్లు రాబట్టింది. మరో 5 కోట్లుకుపైగా రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అవుతుంది. త్వరలోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X