twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shyam Singha Roy Collections: మరీ దారుణంగా నాని మూవీ కలెక్షన్లు.. 22 కోట్లకు వచ్చింది ఎంతంటే!

    |

    నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ 'జెర్సీ' తర్వాత నేచురల్ స్టార్ నాని.. ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. దీని తర్వాత అతడు మూడు సినిమాల్లో నటించాడు. అందులో రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. దీంతో భారీ సక్సెస్‌ను అందుకోవాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ఘన విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాను చేశాడు.

    ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే దక్కాయి. ఫలితంగా బ్రేక్ ఈవెన్‌ను దాటేసి, హిట్ స్టేటస్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 15 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

    శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

    నేచురల్ స్టార్ నాని - రాహుల్ సంకృత్యన్ కలయికలో వచ్చిన చిత్రమే ‘శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి భారీ సక్సెస్‌ను కొట్టింది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

    నాని సినిమా బిజినెస్ వివరాలివే

    నాని సినిమా బిజినెస్ వివరాలివే

    నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్‌' రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 15 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 115.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

    15వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    15వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    భారీ విజయం కోసం వేచి చూస్తోన్న నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. అయితే, రోజులు గడుస్తోన్న కొద్దీ ఈ సినిమా ప్రభావం పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 15వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 లక్షలే రాబట్టింది.

    ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

    15 రోజులకూ కలిపి వచ్చిందింత

    15 రోజులకూ కలిపి వచ్చిందింత

    15 రోజులకు కలిపి ‘శ్యామ్ సింగ రాయ్'కు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.15 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.10 లక్షలు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 18.90 కోట్లు షేర్, రూ. 32.14 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ఏపీ తెలంగాణలో 15 రోజులకు రూ. 18.90 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ చక్కగా రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.60 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 15 రోజులకు రూ. 25.42 కోట్లు షేర్‌, రూ. 44.50 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

    Recommended Video

    Actor Nani About His Learning Experience As Assistant Director | Filmibeat Telugu
    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లోనే రూ. 25.42 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.92 కోట్లు లాభాలను అందుకుంది.

    English summary
    Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. This Movie Collects Rs 25.42 Crores in 15 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X