Shyam Singha Roy Collections: వీకెండ్‌లో మళ్లీ పెరిగిన కలెక్షన్లు.. మరో ఘనతను అందుకున్న నాని

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేసిన అతడు.. స్టార్ స్టేటస్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే విలక్షణ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీలో నటించాడు. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరు కూడా ఓ లుక్కేయండి!

శ్యామ్ సింగ రాయ్‌గా విశ్వరూపం

శ్యామ్ సింగ రాయ్‌గా విశ్వరూపం

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి సూపర్ సక్సెస్ అయింది.

నాని మూవీ బిజినెస్ జరిగిందిలా

నాని మూవీ బిజినెస్ జరిగిందిలా

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్‌' హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 116.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్ జరిగిందని టాక్.

16వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

16వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

క్రేజీ దర్శకుడితో నేచురల్ స్టార్ నాని చేసిన 'శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. అయితే, ఈ మధ్య కలెక్షన్లు పడిపోతూ వచ్చి శనివారం కొంత పెరిగాయి. దీంతో 16వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 11 లక్షలు వసూలు అయ్యాయి.

16 రోజులకూ కలిపి వచ్చిందింత

16 రోజులకూ కలిపి వచ్చిందింత

'శ్యామ్ సింగ రాయ్'కు 16 రోజులకు కలిపి మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.16 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.11 కోట్లు, వెస్ట్‌లో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 64 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 19.01 కోట్లు షేర్, రూ. 32.34 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ఏపీ తెలంగాణలో 16 రోజులకు రూ. 19.01 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ మంచిగానే రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.62 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 16 రోజులకు రూ. 25.57 కోట్లు షేర్‌, రూ. 44.80 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

నాని 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లోనే రూ. 25.57 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.07 కోట్లు లాభాల మైలురాయిని కూడా అందుకుని సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X