twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shyam Singha Roy Collections: వరుసగా రెండోరోజూ పెరిగిన కలెక్షన్లు.. 17 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచే మంచి విజయాలను అందుకుని స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్న నాని.. ఇటీవలే రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీలో నటించాడు.

    Recommended Video

    Shyam Singha Roy : Actor Nani On His Script Selection | Filmibeat Telugu

    ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    శ్యామ్ సింగ రాయ్‌గా నాని సందడి

    శ్యామ్ సింగ రాయ్‌గా నాని సందడి

    నేచురల్ స్టార్ నాని - రాహుల్ సంకృత్యన్ కలయికలో రూపొందిన చిత్రమే ‘శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి విజయం సాధించింది.

    టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామటాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

    శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

    శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

    నాని మార్కెట్‌ను బట్టి ‘శ్యామ్ సింగ రాయ్‌' హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్ జరిగిందని తెలిసింది.

    17వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    17వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

    చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న నేచురల్ స్టార్ నాని చేసిన ‘శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కొద్ది రోజులుగా పడిపోతోన్న కలెక్షన్లు ఆదివారం పెరిగాయి. దీంతో 17వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 15 లక్షలు వచ్చాయి.

    Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీBigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

    17 రోజులకూ కలిపి వచ్చిందింత

    17 రోజులకూ కలిపి వచ్చిందింత

    ‘శ్యామ్ సింగ రాయ్'కు 17 రోజులకు కలిపితే మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.18 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.12 కోట్లు, వెస్ట్‌లో రూ. 86 లక్షలు, గుంటూరులో రూ. 1.20 కోట్లు, కృష్ణాలో రూ. 99 లక్షలు, నెల్లూరులో రూ. 65 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 19.16 కోట్లు షేర్, రూ. 32.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    తెలుగు రాష్ట్రాల్లో 17 రోజులకు రూ. 19.16 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.97 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.64 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 17 రోజులకు రూ. 25.77 కోట్లు షేర్‌, రూ. 45.20 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

    ‘శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లోనే రూ. 25.77 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.27 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

    English summary
    Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. This Movie Collects Rs 25.77 Crores in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X