Shyam Singha Roy Collections: 22 కోట్ల బిజినెస్.. 3 వారాల్లోనే అన్ని కోట్లు.. మొత్తం లాభాలు ఎంతంటే!

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సహాజ సిద్ధమైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అయితే, 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా నాని రచ్చ

శ్యామ్ సింగ రాయ్‌గా నాని రచ్చ

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి సూపర్ హిట్ అయింది.

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్‌' హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల లెక్క.

21వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

21వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

చాలా రోజులుగా హిట్ కోసం చూస్తున్న నేచురల్ స్టార్ నాని చేసిన 'శ్యామ్ సింగ రాయ్'కు ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, కొద్ది రోజులుగా పడిపోతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే 21వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి రూ. 4 లక్షలు మాత్రమే వచ్చాయి.

3 వారాలకు కలిపి వచ్చిందింత

3 వారాలకు కలిపి వచ్చిందింత

3 వారాలకు చూస్తే.. 'శ్యామ్ సింగ రాయ్'కు మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.22 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.14 కోట్లు, వెస్ట్‌లో రూ. 86 లక్షలు, గుంటూరులో రూ. 1.21 కోట్లు, కృష్ణాలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 65 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 19.39 కోట్లు షేర్, రూ. 33 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

తెలుగు రాష్ట్రాల్లో 3 వారాలకు రూ. 19.39 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.70 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 21 రోజుల్లో రూ. 26.10 కోట్లు షేర్‌, రూ. 46 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లో రూ. 26.10 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.60 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X