Shyam Singha Roy Collections: రికార్డులు తిరగరాసిన నాని.. 2 రోజుల్లోనే అన్ని కోట్లతో నాలుగో స్థానం

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ హీరో నాని. ప్రతి చిత్రంలోనూ సహజ సిద్ధమైన నటనను చూపిస్తూ నేచురల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. దీంతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తోన్న నాని.. ఈ మధ్య రెండు చిత్రాలను చేశాడు. కానీ, అవి ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి నేరుగా థియేటర్లలోనే ప్రేక్షకులను అలరించేందుకు 'శ్యామ్ సింగ రాయ్'గా వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్‌ దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరి ఈ సినిమా రెండు రోజుల బాక్సాఫీస్‌పై లుక్కేద్దామా!

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

కొంత కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాలో నటించాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్

నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ హక్కులకు బాగా పోటీ ఏర్పడింది. దీంతో దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల బిజినెస్ జరిగింది.

రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

'శ్యామ్ సింగ రాయ్' మూవీకి రెండో రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 52 లక్షలు, ఈస్ట్‌లో రూ. 21 లక్షలు, వెస్ట్‌లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.38 కోట్లు షేర్, రూ. 7.12 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకూ కలిపి వసూళ్లిలా

రెండు రోజులకూ కలిపి వసూళ్లిలా

నాని సినిమాకు ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 4.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 41 లక్షలు, వెస్ట్‌లో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 8.56 కోట్లు షేర్, రూ. 14.02 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు రూ. 8.56 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.30 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి నాని సినిమా రెండు రోజుల్లోనే రూ. 12.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.50 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

 టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 12.81 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 9.69 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

 టాలీవుడ్‌లో నాలుగో సినిమా ఇది

టాలీవుడ్‌లో నాలుగో సినిమా ఇది

మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూలు చేసిన నాని 'శ్యామ్ సింగ రాయ్' మూవీ అదిరిపోయే రికార్డును నమోదు చేసింది. టైర్ 2 హీరోల్లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో లవ్ స్టోరి రూ. 5.08 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మజిలీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X