Shyam Singha Roy Collections: పుష్పను దాటిన శ్యామ్ సింగ రాయ్.. ఐదు రోజుల్లోనే అన్ని కోట్లతో అరాచకం
తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సహజ సిద్ధమైన నటనతో కెరీర్ ఆరంభం నుంచీ సత్తా చాటుతోన్న అతడు.. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య రెండు సినిమాలు చేసినా.. అవి ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ నేపథ్యంలోనే నాని తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని
భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాలో నటించాడు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదల అయింది.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్
'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అన్ని ఏరియాల హక్కులకు పోటీ బాగా ఏర్పడింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల బిజినెస్ జరిగింది.

ఐదవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా
నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఐదో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 74 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఐదు రోజులకూ కలిపి వసూళ్లిలా
నాని 'శ్యామ్ సింగ రాయ్'కు ఐదు రోజుల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.63 కోట్లు, ఈస్ట్‌లో రూ. 73 లక్షలు, వెస్ట్‌లో రూ. 60 లక్షలు, గుంటూరులో రూ. 90 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 14.19 కోట్లు షేర్, రూ. 24.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు రూ. 14.19 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.30 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి నాని సినిమా ఐదు రోజుల్లోనే రూ. 19.94 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.45 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 19.94 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.56 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

పుష్ప కంటే ఎక్కువ కలెక్షన్లతో
నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంగళవారం మంచి వసూళ్లు వచ్చాయి. ఆరోజు అల్లు అర్జున్ 'పుష్ప'కు రూ. 69 లక్షలు మాత్రమే వసూలు కాగా.. 'శ్యామ్ సింగ రాయ్'కు మాత్రం రూ. 74 లక్షలు వచ్చాయి. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు రెస్పాన్స్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











