Shyam Singha Roy Collections: మరింత తగ్గిన కలెక్షన్లు.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాల్సిందే

నేచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా అతడు చాలా కాలంగా టాలీవుడ్‌లో తనదైన శైలి నటనతో, విభిన్నమైన చిత్రాలతో హవా చూపిస్తున్నాడు. సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటూ దూసుకెళ్తున్నాడు. అయితే, 'జెర్సీ' మూవీ తర్వాత నానికి పెద్దగా సక్సెస్‌లు రాలేదు.

Recommended Video

Shyam Singha Roy Success Meet | Filmibeat Telugu

దీనికి కారణం అతడు నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల కావడమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆరంభం నుంచే మంచి టాక్‌తో కలెక్షన్లు బాగా రాబడుతోంది. మరి ఈ సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దామా!

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

శ్యామ్ సింగ రాయ్‌గా వచ్చిన నాని

నేచురల్ స్టార్ నాని - రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

నాని సినిమా ప్రి బిజినెస్ డీటేల్స్

నాని సినిమా ప్రి బిజినెస్ డీటేల్స్

'శ్యామ్ సింగ రాయ్'కు అన్ని ఏరియాల్లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 8 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 18.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల లెక్క.

8వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

8వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?

విలక్షన కాన్సెప్టుతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి 8వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 27 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

Deepthi Shanmukh Breakup: దీప్తి సునైనా సంచలన ప్రకటన.. న్యూ ఇయర్‌ రోజు షణ్ముఖ్‌కు షాక్.. అందుకేనట!

8 రోజులకూ కలిపి వచ్చిందింత

8 రోజులకూ కలిపి వచ్చిందింత

'శ్యామ్ సింగ రాయ్'కు 8 రోజులకు కలిపి భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 82 లక్షలు, వెస్ట్‌లో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 8 రోజుల్లో రూ. 15.19 కోట్లు షేర్, రూ. 25.73 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులకు రూ. 15.19 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.53 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.40 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 8 రోజుల్లోనే రూ. 21.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 37.35 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

వైవిధ్యమైన కథతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే రూ. 21.12 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.38 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X