Shyam Singha Roy Collections: ఒక్కరోజే అన్ని కోట్లతో టార్గెట్ ఫినీష్.. మొదటి స్థానానికి నాని మూవీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ స్టార్‌గా వెలుగొందుతున్నాడు నాని. అందుకు అనుగుణంగానే విలక్షణమైన సినిమాలు చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. దీంతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే, నాని 'జెర్సీ' మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు.
దీని తర్వాత వచ్చిన చిత్రాలతో అతడి అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆరంభం నుంచే మంచి టాక్‌తో కలెక్షన్లు కూడా రాబడుతోంది. మరి ఈ సినిమా 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దామా!

శ్యామ్ సింగ రాయ్‌గా మారిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా విడుదలై దూసుకుపోతోంది.

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా
నాని సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 9 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 9 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

9వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత?
నాని 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి 9వ రోజు కలెక్షన్లు భారీ స్థాయిలో పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 97 లక్షలు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్‌లో రూ. 13 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.98 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజులకూ కలిపి వచ్చిందింత
9 రోజులకు కలిపి 'శ్యామ్ సింగ రాయ్'కు భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.96 కోట్లు, ఈస్ట్‌లో రూ. 95 లక్షలు, వెస్ట్‌లో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 1.05 కోట్లు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో 9 రోజుల్లో రూ. 17.17 కోట్లు షేర్, రూ. 29.13 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు రూ. 17.17 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.45 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 9 రోజుల్లోనే రూ. 23.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 40.50 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?
పునర్జన్మల కథతో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే రూ. 23.33 కోట్లు వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 83 లక్షలు లాభాలు వచ్చాయి.

టాలీవుడ్‌లో మొదటి సినిమాగా
నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి తొమ్మిదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.98 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో 9వ రోజు ఎక్కువ కలెక్షన్లను సాధించిన టైర్ 2 హీరోల జాబితాలో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. తద్వారా శర్వానంద్ 'శతమానంభవతి' రెండో స్థానానికి పడిపోయింది. ఇందులో ఫిదా మూడో స్థానంలో, గీత గోవిందం నాలుగో స్థానంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











