Shyam Singha Roy Collections: 22 కోట్ల బిజినెస్.. ఊహించని కలెక్షన్లు.. రికార్డు క్రియేట్ చేసిన నాని

'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు టాలీవుడ్ సెన్సేషన్ నేచురల్ స్టార్ నాని. దీని తర్వాత 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేసినా అది నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత అతడు చేసిన 'V', 'టక్ జగదీష్' మూవీలు నేరుగా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. దీంతో నాని అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాతో ఈ స్టార్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఇక, ఇప్పుడు ముగింపు సమయానికి ఈ మూవీ ఎంత వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది? అనే వివరాలు చూద్దాం పదండి!

శ్యామ్ సింగ రాయ్‌గా నాని సందడి

శ్యామ్ సింగ రాయ్‌గా నాని సందడి

నేచురల్ స్టార్ నాని - రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే 'శ్యామ్ సింగ రాయ్'. దీన్ని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇది క్రిస్టమస్ కానుకగా వచ్చి విజయవంతం అయింది.

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

శ్యామ్ సింగ రాయ్ బిజినెస్ ఇలా

నాని 'శ్యామ్ సింగ రాయ్‌' థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 6 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్ జరిగిందని తెలిసింది.

అలా మొదలై.. ఇలా ముగిసింది

అలా మొదలై.. ఇలా ముగిసింది

కొంత కాలంగా హిట్ కోసం చూస్తున్న నేచురల్ స్టార్ నాని చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, ఈ మధ్య కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 21 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్టీమింగ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల రిపోర్ట్

ముగింపు సమయానికి 'శ్యామ్ సింగ రాయ్'కు మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 9.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.25 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.16 కోట్లు, వెస్ట్‌లో రూ. 87 లక్షలు, గుంటూరులో రూ. 1.24 కోట్లు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 65 లక్షలతో.. ఏపీ తెలంగాణలో రూ. 19.67 కోట్లు షేర్, రూ. 33.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

తెలుగు రాష్ట్రాల్లో ముగింపు సమయానికి రూ. 19.67 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.75 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా చివరికి రూ. 26.50 కోట్లు షేర్‌, రూ. 46.80 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 26.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4 కోట్లు లాభాలను అందుకుని రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X