Dasara Official Collections: దంచి కొట్టిన దసరా.. శనివారం అరాచకంగా.. మరో 6 లక్షలు వస్తే సంచలనమే!

బ్యాంగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి సహజసిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. దీంతో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు నాని 'దసరా' అనే సినిమాతో వచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

Nani Starrer Dasara Movie 10 Days Worldwide Official Collections

దసరా అంటూ వచ్చిన హీరో నాని: టాలెంటెడ్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు: నాని 'దసరా' చిత్రానికి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసుకుంది.

Nani Starrer Dasara Movie 10 Days Worldwide Official Collections

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 10వ రోజు 'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 75 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1.00 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

10 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 10 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 23.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.19 కోట్లు, గుంటూరులో రూ. 2.31 కోట్లు, కృష్ణాలో రూ. 1.77 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో కలిపి.. రూ. 41.02 కోట్లు షేర్, రూ. 69.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 10 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లోనే రూ. 41.02 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.45 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.47 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.15 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.94 కోట్లు షేర్‌, రూ. 105.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: పల్లెటూరి మాస్ కథతో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 410 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 58.94 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 9.94 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

Nani Starrer Dasara Movie 10 Days Worldwide Official Collections

మరో ఆరు లక్షలు వస్తే రికార్డు: నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా రూ. 60 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 9.94 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది. అంటే.. మరో ఆరు లక్షలు రూపాయలు వసూలు అయితే నాని సినిమా మరో సంచలన రికార్డును నమోదు చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X