Dasara Official Collections: సండే ఊహించని విధంగా.. ఏకంగా అన్ని కోట్లతో రికార్డు.. లాభాలతో సెన్సేషన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టింగ్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. ప్రతి చిత్రానికీ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. అన్ని రకాల జోనర్లలో ప్రాజెక్టులు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో వచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

దసరా అంటూ నాని ఊరమాస్: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Nani Starrer Dasara Movie 11 Days Worldwide Official Collections

దసరా మూవీ బిజినెస్ వివరాలు: నాని నటించిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'దసరా' మూవీకి 11వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 93 కోట్లు షేర్, రూ. 1.52 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Nani Starrer Dasara Movie 11 Days Worldwide Official Collections

11 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు 11 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 24.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.21 కోట్లు, గుంటూరులో రూ. 2.35 కోట్లు, కృష్ణాలో రూ. 1.80 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 41.95 కోట్లు షేర్, రూ. 70.92 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 11 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.95 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.53 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.48 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.30 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.16 కోట్లు షేర్‌, రూ. 108.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 11 Days Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: పక్కా మాస్ మసాలా కథతో వచ్చిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 411 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 60.16 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 11.16 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

అన్ని కోట్లతో సంచలన రికార్డు: టాలెంటెడ్ హీరో నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 60 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 11.16 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది. తద్వారా ఒకే రోజు రూ. 60 కోట్లు షేర్, రూ. 10 కోట్లు లాభాల మార్కును చేరుకుని ఈ చిత్రం రికార్డును సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X