Dasara Official Collections: మళ్లీ పడిపోయిన వసూళ్లు.. 13 రోజుల్లో షాకింగ్‌గా.. లాభమెంతో తెలిస్తే!

స్వయంకృషితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి సహజసిద్ధమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్న అతడు.. ఇటీవలే 'దసరా' అనే పూర్తి స్థాయి మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి కలెక్షన్ల పంట పండించింది. దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

దసరాలో అరాచకంగా హీరో నాని:టాలెంటెడ్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు.

Nani Starrer Dasara Movie 13 Days Worldwide Official Collections

దసరా మూవీ బిజినెస్ వివరాలు:నేచురల్ స్టార్ నాని 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ అయింది.

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:నాని - కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఈ వారంలో మాత్రం వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 12వ రోజు 39 లక్షలే రాబట్టిన ఈ చిత్రం 13వ రోజు రూ. 31 లక్షలు వసూలు చేసింది.

Nani Starrer Dasara Movie 13 Days Worldwide Official Collections

13 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?:13 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 24.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.17 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 2.38 కోట్లు, కృష్ణాలో రూ. 2.05 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి.. రూ. 43.01కోట్లు షేర్, రూ. 72.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లోనే రూ. 43.01 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.60 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.51 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.40 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 61.46 కోట్లు షేర్‌, రూ. 110.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 13 Days Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:పూర్తి స్థాయి మాస్ కథతో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 413 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 61.46 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 12.46 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X