Dasara 15 Days Collections: దసరా మరో రికార్డు.. 15 రోజుల్లోనే అన్ని కోట్లు.. నిర్మాతలకు జాక్‌పాట్
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. ఎన్నో హిట్లను అందుకుని.. టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు నాని. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే'దసరా' అనే పూర్తి స్థాయి మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి కలెక్షన్ల పంట పండించింది. దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరూ చూసేయండి!
దసరాలో హీరో నాని విశ్వరూపం:నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు:నాని హీరోగా చేసిన 'దసరా'కు నైజాంలో రూ. 15.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగింది.
15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:నాని - కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఈ వారంలో మాత్రం వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 14వ రోజు 30 లక్షలే రాబట్టిన ఈ చిత్రం 15వ రోజు రూ. 23 లక్షలు వసూలు చేసింది.

15 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు 15 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 2.40 కోట్లు, కృష్ణాలో రూ. 2.07 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి.. రూ. 43.54 కోట్లు షేర్, రూ. 73.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:15 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 43.54 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.63 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.52 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.44 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.08 కోట్లు షేర్, రూ. 111.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:మాస్ యాక్షన్‌తో వచ్చిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 415 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 62.08 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 13.08 కోట్లు లాభాలు వచ్చి రికార్డు కూడా నమోదైంది.


Click it and Unblock the Notifications











