Dasara 16 Days Collections: దసరాకు బిగ్ షాక్.. కానీ లాభాలతో సెన్సేషన్.. మరో 10 లక్షలు వస్తే మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆల్‌రౌండ్ టాలెంట్ ఉన్న హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మరింత ఎక్కువ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు.
ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో మాయ చేస్తోన్న అతడు.. ఇటీవలే 'దసరా' అనే పక్కా మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సత్తా చాటింది. దీంతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

దసరాలో హీరో నాని ఊరమాస్: టాలెంటెడ్ గాయ్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంతోష్ నారాయనణ్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: నేచురల్ స్టార్ నాని 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ జంటగా రూపొందిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఈ వారంలో మాత్రం వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 15వ రోజు 23 లక్షలే రాబట్టిన ఈ చిత్రం 16వ రోజు రూ. 15 లక్షలు వసూలు చేసింది.
16 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 'దసరా'కు 16 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.37 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 2.41 కోట్లు, కృష్ణాలో రూ. 2.08 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి.. రూ. 43.69 కోట్లు షేర్, రూ. 73.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లోనే రూ. 43.69 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.63 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.52 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.45 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.24 కోట్లు షేర్, రూ. 111.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: క్రేజీ కాంబోలో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 62.24 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 13.24 కోట్లు లాభాలొచ్చాయి. దీనికి మరో రూ. 10 లక్షలు గ్రాస్ వస్తే.. రూ. 112 కోట్ల మార్కును చేరుతుంది.


Click it and Unblock the Notifications











