Dasara 17 Days Collections: దసరా వసూళ్లు డబుల్.. 17 రోజుల్లోనే అన్ని కోట్లు.. లాభాలు కూడా గట్టిగానే!

సహజసిద్ధమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్‌గా వెలుగొందుతూ.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ గాయ్ నాని. ప్రతి సినిమానూ తనదైన నటనతో వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్న అతడు.. ఎన్నో ప్రయోగాలూ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటింది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

Nani Starrer Dasara Movie 17 Days Worldwide Official Collections

దసరా అంటూ వచ్చిన హీరో నాని: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు. సంతోష్ నారాయనణ్ దీనికి సంగీతం అందించాడు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు: నాని నటించిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

Nani Starrer Dasara Movie 17 Days Worldwide Official Collections

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: టాలెంటెడ్ హీరో నాని - కీర్తి సురేష్ జోడీగా నటించిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఈ వారంలో మాత్రం వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 16వ రోజు 15 లక్షలే రాబట్టిన ఈ చిత్రం 17వ రోజు రూ. 29 లక్షలు వసూలు చేసింది.

17 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 17 రోజుల్లో 'దసరా'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.39 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.24 కోట్లు, గుంటూరులో రూ. 2.42 కోట్లు, కృష్ణాలో రూ. 2.09 కోట్లు, నెల్లూరులో రూ. 92 లక్షలతో కలిపి.. రూ. 43.98 కోట్లు షేర్, రూ. 74.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 17 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 17 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 43.98 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.64 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.53 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.46 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.57 కోట్లు షేర్‌, రూ. 112.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 62.57 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 13.57 కోట్లు లాభాలొచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X