Dasara Collections: 18వ రోజు మళ్ళీ పెరిగిన కలెక్షన్స్.. పోటీ ఉన్నా ప్రాఫిట్స్ తగ్గట్లే.. ఎంత వచ్చాయంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయినా కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాని కెరీర్ మొత్తంలో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా దసరా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు ఈవారం పోటీగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా దసరా కలెక్షన్స్ అసలు తగ్గడం లేదు. ఇక 18వ రోజు దసరా సినిమా మొత్తంగా ఎంత కలెక్షన్స్ అందుకుంది ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

దసరా బిజినెస్: తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా లో నానికి జంటగా కీర్తి సురేష్ నటించగా సముద్రఖని దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకురాగా సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇక సినిమా బిజనెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.
18వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్: 'దసరా'. సినిమా ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ అందుకుంది. ఇక సినిమాకు బాక్సాఫీస్ నైజాంలోనే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. ఇక మూడవ వారంలో ఈ సినిమా కలెక్షన్స్ క్రమక్రమంగా తగ్గుతూ రాగా 18వ రోజు ఆదివారం కావడంతో మళ్లీ ఊహించిన విధంగా పెరిగాయి. 17వ రోజు 29 లక్షలే రాబట్టిన ఈ సినిమా 19వ రోజు మాత్రం ఏకంగా 33 లక్షలు వసూలు చేసింది.

18 రోజులకూ తెలుగు స్టేట్స్ కలెక్షన్స్: 18 రోజుల్లో 'దసరా' సినిమా ఆంధ్రా, తెలంగాణలో మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక నైజాంలో రూ. 25.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 2.43 కోట్లు, కృష్ణాలో రూ. 2.11 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి.. రూ. 44.31 కోట్లు షేర్, రూ. 74.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్..: 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 44.31 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.66 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.54 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.48 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.97 కోట్లు షేర్, రూ. 113.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. ప్రాఫిట్ ఎంత?: నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 62.97 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 13.97 కోట్లు లాభాలొచ్చాయి.


Click it and Unblock the Notifications











