Dasara 19 Days Collections: దసరా మరో రికార్డు.. ఏపీ, తెలంగాణలోనే అన్ని కోట్లు.. లాభమెంతో తెలిస్తే!
సహజసిద్ధమైన నటన, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకుంటూ నేచురల్ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకునే చిత్రాల్లో నటిస్తోన్న అతడు.. ఇటీవలే 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని నటించిన 'దసరా' మూవీ 19 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

దసరా అంటూ నాని ప్రయోగం: టాలెంటెడ్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు. సంతోష్ నారాయనణ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: నేచురల్ స్టార్ నాని 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

19వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: సహజసిద్ధమైన నటులు నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, ఈ వారంలో వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 17వ రోజు 33 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 19వ రోజు రూ. 15 లక్షలే వసూలు చేసింది.
19 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: దసరా'కు 19 రోజుల్లో 'ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 2.44 కోట్లు, కృష్ణాలో రూ. 2.12 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి.. రూ. 44.46 కోట్లు షేర్, రూ. 75.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 19 రోజుల్లోనే రూ. 44.46 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.66 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.54 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.99 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.49 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.14 కోట్లు షేర్, రూ. 113.78 కోట్లు గ్రాస్ వచ్చింది.
మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 63.14 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.14 కోట్లు లాభాలొచ్చాయి. ఇక ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 75 కోట్లు గ్రాస్ మార్కును చేరి రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











