Dasara Official Collections: 49 కోట్ల టార్గెట్.. వారంలోనే సెంచరీ.. నాని సినిమా లాభం ఎంతో తెలిస్తే!

విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ప్రయోగాలను చేస్తూ సత్తా చాటుతోన్నాడు ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతుయి. ఈ క్రమంలో మొదటి వారంలో ఈ చిత్రం సెంచరీ చేసింది. మరి 'దసరా' 7 రోజుల రిపోర్టు మీరే చూసేయండి!

Nani Starrer Dasara Movie 1st Week Worldwide Official Collections

మాస్ యాంగిల్ చూపించిన నాని: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన పక్కా మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు: 'దసరా' సినిమాకు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసుకుంది.

Nani Starrer Dasara Movie 1st Week Worldwide Official Collections

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'దసరా' మూవీకి 7వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 89 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1.25 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

7 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు వారం రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 21.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.00 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.15 కోట్లు, గుంటూరులో రూ. 2.23 కోట్లు, కృష్ణాలో రూ. 1.69 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో కలిపి.. రూ. 38.21 కోట్లు షేర్, రూ. 64.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 1st Week Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే రూ. 38.21 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.20 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.40 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.60 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.17 కోట్లు షేర్‌, రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: పూర్తి స్థాయి మాస్ కథతో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 55.17 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 6.17 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

Nani Starrer Dasara Movie 1st Week Worldwide Official Collections

నాని కెరీర్‌లోనే అత్యధికంగా: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా వారం రోజుల్లోనూ ఈ చిత్రం కోటికి పైగానే షేర్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. మొత్తంగా ఇప్పటి వరకూ వంద కోట్ల గ్రాస్‌ మార్కును కూడా చేరుకుంది. తద్వారా నాని కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా ఇది రికార్డును నమోదు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X