Dasara Official Collections: నాని మాస్ బ్యాటింగ్.. 2 రోజుల్లోనే హాఫ్ సెంచరీ.. టాప్ హీరోగా రికార్డు
నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుతూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ హీరో నాని. కెరీర్ ఆరంభం నుంచీ ప్రతి చిత్రంలోనూ వన్ మ్యాన్ షో అనేలా నటిస్తూ.. ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటోన్నాడు. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'దసరా' అనే మాస్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. రెండో రోజు మాత్రం కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో 'దసరా' 2 రోజుల రిపోర్టును మీరే చూడండి!

పక్కా మాస్ మూవీతో వచ్చేశాడు
టాలెంటెడ్ హీరో నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు
'దసరా' చిత్రానికి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 5.86 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?
'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, గుంటూరులో రూ. 1.46 కోట్లు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో కలిపి.. రూ. 20.08 కోట్లు షేర్, రూ. 34.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లోనే రూ. 20.08 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, వేరే భాషల్లో రూ. 65 లక్షలు, నార్త్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5.60 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.08 కోట్లు షేర్, రూ. 52.40 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?
మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లోనే దీనికి రూ. 29.08 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 19.98 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

తగ్గిన వసూళ్లు.. టాప్ హీరోగానే
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'దసరా' తొలి రోజే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, రెండో రోజు మాత్రం దీనికి వసూళ్లు సగానికి సగం పడిపోయాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.86 కోట్లు వసూలు చేసింది. తద్వారా రెండో రోజు అత్యధికంగా వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోగా నాని రికార్డు నమోదు చేశాడు. అలాగే, ఓవర్సీస్‌లోనే ఒక మిలియన్ మార్కును చేరాడు.


Click it and Unblock the Notifications











