Dasara 20 Days Collections: 20వ రోజు ఊహించని విధంగా.. మొత్తం కలిపి అన్ని కోట్లు.. లాభాలతో రికార్డు

విలక్షణమైన నటనకు తోడు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు నేచురల్ స్టార్ నాని. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో ఇప్పుడు నాని 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఇప్పుడు నిరాశనే ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నాని నటించిన 'దసరా' మూవీ 20 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

Nani Starrer Dasara Movie 20 Days Worldwide Official Collections

దసరా అంటూ వచ్చేసిన నాని: నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన పక్కా మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు: నాని నటించిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

Nani Starrer Dasara Movie 20 Days Worldwide Official Collections

20వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: టాలీవుడ్ టాలెంటెడ్ కపుల్ నాని, కీర్తి సురేష్ నటించిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, ఈ వారంలో వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 19వ రోజు 15 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 20వ రోజు మరింత తగ్గి రూ. 13 లక్షలే వసూలు చేసింది.

20 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 20 రోజుల్లో 'దసరా'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 2.45 కోట్లు, కృష్ణాలో రూ. 2.13 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి.. రూ. 44.59 కోట్లు షేర్, రూ. 75.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 20 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లోనే రూ. 44.59 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.67 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.50 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.31 కోట్లు షేర్‌, రూ. 114.13 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నాని హీరోగా నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 63.31 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.31 కోట్లు లాభాలతో సరికొత్త రికార్డును సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X