Dasara 22 Days Collections: తేలిపోయిన దసరా.. 22 రోజుల్లో ఊహించని వసూళ్లు.. వాళ్లకు కోట్ల జాక్‌పాట్
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలి నటన, ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు నాని. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ప్రయోగాలు చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఈ వారంలో మాత్రం వరుసగా డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 22 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!
పక్కా మాస్ మూవీతో వచ్చిన నాని:నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు:నాని నటించిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ జోడీగా నటించిన సినిమానే 'దసరా'. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, 3వ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 21వ రోజు 11 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 22వ రోజు రూ. 10 లక్షలే కలెక్ట్ చేసింది.

22 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?:22 వారాల్లో 'దసరా'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, గుంటూరులో రూ. 2.47 కోట్లు, కృష్ణాలో రూ. 2.15 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో కలిపి.. రూ. 44.80 కోట్లు షేర్, రూ. 75.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:తెలుగు రాష్ట్రాల్లో 22 రోజుల్లోనే రూ. 44.80 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.67 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.56 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.52 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.59 కోట్లు షేర్, రూ. 114.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?:నేచురల్ స్టార్ నాని 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 22 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 63.59 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.59 కోట్లు లాభాలతో పెద్ద జాక్‌పాటే తగిలిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











