Dasara 23 Days Collections: నానికి మరో దెబ్బ.. ఓవరాల్‌గా రికార్డు వసూళ్లు.. అన్నీ పోను లాభం ఎంతంటే!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరికీ మాత్రమే మంచి నటులుగా గుర్తింపు ఉంది. అలాంటి వారిలో సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలతో వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఈ వారంలో మాత్రం వరుసగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 23 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

Nani Starrer Dasara Movie 23 Days Worldwide Official Collections

దసరా అంటూ వచ్చేసిన నాని: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు: మాస్ మూవీ 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్‌ చేసుకుంది.

Nani Starrer Dasara Movie 23 Days Worldwide Official Collections

23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: నాని హీరోగా.. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన సినిమానే 'దసరా'. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, 3వ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 22వ రోజు 10 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 23వ రోజు రూ. 8 లక్షలే వసూలు చేసింది.

23 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 'దసరా'కు 23 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.27 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 2.48 కోట్లు, కృష్ణాలో రూ. 2.16 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో కలిపి.. రూ. 44.88 కోట్లు షేర్, రూ. 75.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Dasara Movie 23 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 23 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 44.88 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.68 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.57 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.53 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.70 కోట్లు షేర్‌, రూ. 114.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నాని నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 63.70 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.70 కోట్లు లాభాలతో పెద్ద జాక్‌పాటే తగిలిందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X