Dasara 24 Days Collections: ఆ మైలురాయి దాటిన దసరా.. తొలి సినిమాగా రికార్డు.. అన్ని కోట్లు మిగిలాయా!
ఏమాత్రం సపోర్టు లేకుండానే సినీ కెరీర్‌ను మొదలు పెట్టినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అలా సుదీర్ఘ కాలంగా విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటోన్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఈ వారంలో మాత్రం వరుసగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 24 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూడండి!

దసరా అంటూ నాని ప్రయోగం: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: మాస్ స్టోరీతో వచ్చిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసింది.

24వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రమే 'దసరా'. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, 3వ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 23వ రోజు 8 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 24వ రోజు రూ. 12 లక్షలు కలెక్ట్ చేసింది.
24 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 24 వారాల్లో 'దసరా'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 26.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, గుంటూరులో రూ. 2.49 కోట్లు, కృష్ణాలో రూ. 2.17 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలతో కలిపి.. రూ. 45.00 కోట్లు షేర్, రూ. 76.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లోనే రూ. 45.00 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.69 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.58 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.03 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.54 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.86 కోట్లు షేర్, రూ. 115.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 24 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 63.86 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.86 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇక, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 45 కోట్లు షేర్ మార్కును దాటింది. తద్వారా నాని కెరీర్‌లో టాప్ మూవీగా నిలిచింది.


Click it and Unblock the Notifications











