Dasara 25 Days Collections: 25వ రోజూ పెరిగిన వసూళ్లు.. నాని మరో రికార్డు.. టోటల్‌గా ఎంత మిగిలిందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టింగ్‌తో మాయ చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ హీరో నాని ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ప్రతి చిత్రాన్ని వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు.
దీంతో మరిన్ని ప్రయోగాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఇప్పుడు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'దసరా' 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూస్తారా!

దసరా అంటూ నాని మాస్ ట్రీట్: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: నాని హీరోగా చేసిన 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగింది.

25వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: వరుసగా ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతోన్న నాని హీరోగా నటించిన 'దసరా' చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, 3వ వారం నుంచి వసూళ్లు డౌన్ అవుతోన్నాయి. కానీ 24వ రోజు 12 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 25వ రోజు రూ. 14 లక్షలు కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది.
25 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: 'దసరా'కు 25 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 26.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 2.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.18 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో కలిపి.. రూ. 45.14 కోట్లు షేర్, రూ. 76.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 25 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 45.14 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.70 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.59 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.55 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 64.04 కోట్లు షేర్, రూ. 115.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నాని నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 25 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 64.04 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 15.04 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











