Dasara Official Collections: దసరా ఊచకోత.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. రెండో హీరోగా నాని రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో సందడి చేస్తోన్నాడు నేచురల్ స్టార్ నాని. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న అతడు.. ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నేచురల్ స్టార్ 'దసరా' అనే మాస్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. రెండో రోజు మాత్రం కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో 'దసరా' 3 రోజుల రిపోర్టుపై లుక్కేయండి!

పక్కా మాస్ ప్రయోగం చేసిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు
'దసరా' సినిమాకి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసుకుంది.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'దసరా' మూవీకి 3వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 6.73 కోట్లు షేర్, రూ. 11.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?
'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 14.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 87 లక్షలు, గుంటూరులో రూ. 1.74 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 60 లక్షలతో కలిపి.. రూ. 26.81 కోట్లు షేర్, రూ. 45.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లోనే రూ. 26.81 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.90కోట్లు, వేరే భాషల్లో రూ. 95 లక్షలు, నార్త్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6.70 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.26 కోట్లు షేర్, రూ. 68.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?
మాస్ యాక్షన్‌తో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 38.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.74 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

టాలీవుడ్‌లో రెండో హీరోగా నాని
విలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'దసరా' మూడో రోజు మాత్రం ఇది మంచి గ్రోత్‌ను చూపించింది. ఇక, ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ గ్రాస్‌ను 8 సార్లు సాధించి.. మహేశ్ తర్వాత స్థానంలో నిలిచాడు నాని. అలాగే, మూడో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోల చిత్రాల్లో 'దసరా' రెండో స్థానంలో ఉంది. దీనికంటే ముందు 'ఉప్పెన' మొదటి స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











