Dasara 3 Weeks Collections: 48 కోట్లు బిజినెస్.. 3 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే షాకే
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సహజసిద్ధమైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్న నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాలతో వస్తోన్న అతడు.. ఇటీవలే 'దసరా' అనే సినిమాను చేశాడు.
ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటింది. కానీ, ఈ వారంలో మాత్రం వరుసగా డౌన్ అవుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో నాని నటించిన 'దసరా' మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

దసరా చేయడానికి వచ్చిన నాని: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: నేచురల్ స్టార్ నాని 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 48 కోట్ల బిజినెస్ జరిగింది.

21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: టాలెంటెడ్ గాయ్ నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమానే 'దసరా'. ఈ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, ఈ వారంలో వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ 20వ రోజు 13 లక్షలు రాబట్టిన ఈ చిత్రం 21వ రోజు రూ. 11 లక్షలే కలెక్ట్ చేసింది.
3 వారాలకూ కలిపి ఎంతొచ్చింది?: 3 వారాల్లో 'దసరా'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 25.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 2.46 కోట్లు, కృష్ణాలో రూ. 2.14 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో కలిపి.. రూ. 44.70 కోట్లు షేర్, రూ. 75.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లోనే రూ. 44.70 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.68 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.51 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.45 కోట్లు షేర్, రూ. 114.42 కోట్లు గ్రాస్ వచ్చింది.
మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: నాని నటించిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లోనే ఈ సినిమాకు రూ. 63.45 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.45 కోట్లు లాభాలతో సరికొత్త రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











