Dasara Official Collections: 6వ రోజు ఊహించని విధంగా.. దసరాకు అప్పుడే అన్ని కోట్లు.. లాభం ఎంతంటే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు తమదైన నటనతో సత్తా చాటుతోన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే సహజ సిద్ధమైన యాక్టింగ్‌తో ప్రతి సినిమాలోనూ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే 'దసరా' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఐదో రోజు తగ్గినా ఆరో రోజు బాగానే రాబట్టింది. మరి 'దసరా' 6 రోజుల రిపోర్టు మీరే చూసేయండి!

తొలిసారి మాస్ మూవీతో వచ్చాడు

తొలిసారి మాస్ మూవీతో వచ్చాడు

టాలెంటెడ్ గాయ్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించిన పక్కా మాస్ మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

 దసరా మూవీ బిజినెస్ వివరాలు

దసరా మూవీ బిజినెస్ వివరాలు

నాని 'దసరా' మూవీకి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

6వ రోజు 'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1.52 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?

6 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?

'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 20.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 2.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.64 కోట్లు, నెల్లూరులో రూ. 80 లక్షలతో కలిపి.. రూ. 36.96 కోట్లు షేర్, రూ. 62.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లోనే రూ. 36.96 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.15 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.36 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.35 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.52 కోట్లు షేర్‌, రూ. 96.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?

మూవీకి టార్గెట్.. లాభం ఎంత?

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 53.52 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 4.52 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ఆరో రోజు మాత్రం భారీ షాకే

ఆరో రోజు మాత్రం భారీ షాకే

పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. కానీ, ఆరో రోజు మాత్రం చాలా తక్కువగానే వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నాని నటించిన 'ఎంసీఏ' చిత్రానికి ఆరో రోజు రూ. 2.13 కోట్లు రాగా.. 'నేను లోకల్' మూవీకి రూ. 1.52 కోట్లు దక్కాయి. వీటితో పాటు టైర్ 2 హీరోల చిత్రాలు చాలానే దీనికంటే ముందు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X