Dasara Official Collections: 8వ రోజూ మాస్ బ్యాటింగ్.. దంచి కొట్టిన దసరా.. నానికి లాభం ఎంతో తెలిస్తే!
టాలీవుడ్‌లో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. అందులో నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని ఒకడు. చాలా కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని 'దసరా' అనే సినిమాను చేశాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
దసరా అంటూ వచ్చిన నాని : నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు : నాని 'దసరా' సినిమాకు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది? : 8వ రోజు 'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు కాస్త తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 1.01 కోట్లు షేర్, రూ. 1.70 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
8 రోజులకూ కలిపి ఎంతొచ్చింది? : 8 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'దసరా'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 22.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.16 కోట్లు, గుంటూరులో రూ. 2.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.72 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో కలిపి.. రూ. 39.22 కోట్లు షేర్, రూ. 66.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లోనే రూ. 39.22 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.26 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.44 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.70 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 56.42 కోట్లు షేర్, రూ. 101.40 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. లాభం ఎంత? : ఫుల్ లెంగ్త్ మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 56.42 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 7.42 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.
రెండో వారంలోనూ అదే దూకుడు : నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా వారంలోనే లాభాల బాటను కూడా పట్టేసింది. అయితే, రెండో వారంలో మాత్రం ఈ చిత్రానికి థియేటర్లు సగానికి సగం తగ్గిపోయాయి. అయినప్పటికీ ఎనిమిదో రోజు ఈ సినిమా రూ. 1 కోటి పైగానే వసూళ్లు సాధించి.. అదే దూకుడును ప్రదర్శిస్తోంది.


Click it and Unblock the Notifications











