Dasara Official Collections: నాని మూవీకి షాక్.. 9వ రోజు అతి తక్కువగా.. బాలయ్య రికార్డు సేఫ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన సహజసిద్ధమైన నటనతో సందడి చేస్తూ.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటూ దిగ్విజయంగా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'దసరా' అనే సినిమాతో వచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

దసరా చేసేందుకు వచ్చేశాడు: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దసరా మూవీ బిజినెస్ వివరాలు: 'దసరా' మూవీకి నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసుకుంది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'దసరా' మూవీకి 9వ రోజు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 80 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
9 రోజులకూ కలిపి ఎంతొచ్చింది?: ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో 'దసరా'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 22.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.99 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.17 కోట్లు, గుంటూరులో రూ. 2.28 కోట్లు, కృష్ణాలో రూ. 1.74 కోట్లు, నెల్లూరులో రూ. 84 లక్షలతో కలిపి.. రూ. 40.02 కోట్లు షేర్, రూ. 67.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 9 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 40.02 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.28 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.45 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.85 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 57.42 కోట్లు షేర్, రూ. 103.10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. లాభం ఎంత?: పూర్తి స్థాయి మాస్ కథతో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 57.42 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 8.42 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

బాలయ్య రికార్డు మాత్రం సేఫ్: నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందిన 'దసరా' మూవీకి ఆరంభం నుంచీ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఏకంగా 8 రోజుల పాటు ఆంధ్రా, తెలంగాణలో కోటి రూపాయల కంటే ఎక్కువ షేర్ రాబట్టింది. ఫలితంగా 2023లో ఎక్కువ రోజులు కోటి రాబట్టిన చిత్రాల్లో 'వీర సింహా రెడ్డి'ని సమం చేసింది. ఈ లిస్టులో వాల్తేరు వీరయ్య 12 రోజులతో టాప్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











