Dasara Official Collections: దసరాతో నాని ఊచకోత.. ఒక్కరోజే అన్ని కోట్లా.. బాహుబలి రికార్డు బ్రేక్

క్లాప్ అసిస్టెంట్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. తన సహజసిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని 'దసరా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'దసరా' మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూడండి!

‘దసరా’తో రచ్చ చేసిన నాని

‘దసరా’తో రచ్చ చేసిన నాని

నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

దసరా మూవీ బిజినెస్ వివరాలు

దసరా మూవీ బిజినెస్ వివరాలు

'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్ చేసుకుంది.

అలాంటి టాక్.. కలెక్షన్లు సునామీ

అలాంటి టాక్.. కలెక్షన్లు సునామీ

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన నాని 'దసరా' మూవీ శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'దసరా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 1.22 కోట్లు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 14.22 కోట్లు షేర్, రూ. 24.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 14.45 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, వేరే భాషల్లో రూ. 71 లక్షలు, నార్త్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.10 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.10 కోట్లు షేర్‌, రూ. 38.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'దసరా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 21.10 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 27.90 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

బాహుబలిని దాటి.. రికార్డులు

బాహుబలిని దాటి.. రికార్డులు

మాస్ స్టోరీతో రూపొందిన 'దసరా' తొలి రోజే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా నైజాంలో 'బాహుబలి 1' రికార్డును ఇది బ్రేక్ చేసింది. అలాగే, తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోల చిత్రాల్లో ఇది టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా లైగర్ మూవీ రూ. 9.57 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, ఎన్నో ఏరియాల్లో ఈ చిత్రం కొత్త చరిత్రను రాసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X