Dasara Total Collections: నాని కెరీర్ హయ్యెస్ట్.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంత వచ్చాయంటే?
నేచురల్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో వచ్చిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. విడుదలై రెండు వారాలు తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు సాగింది. నాని కెరీర్ మొత్తంలో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా దసరా రికార్డును క్రియేట్ చేసింది. ఇక సినిమా థియేట్రికల్ గేమ్ ముగిసింది. టోటల్ గా దసరా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రాఫిట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
దసరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్:సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన దసరా సినిమా లో నాని ఊర మాస్ పాత్రలు కనిపించగా అతనికి జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఇక సముద్రఖని దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమా బిజనెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 'దసరా'కు నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.45 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకటలో రూ. 1.85 కోట్లు, వేరే భాషల్లో రూ. 1.50 కోట్లు, నార్త్‌లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

ఏపీ నైజాం టోటల్ కలెక్షన్స్:'దసరా' ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ నుంచే ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ అందుకుంది. నైజాంలోనే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. ఇక మొత్తంగా సినిమా కలెక్షన్స్ క్రమక్రమంగా తగ్గుతూ రాగా టోటల్ గా ఈ సినిమాకు ఏపి నైజాంలో 44 కోట్ల షేర్, 75.85 కోట్ల గ్రాస్ దక్కింది. మిడియం రేంజ్ హీరోలలో ఇదే హయ్యెస్ట్ నెంబర్ గా నిలిచింది.

ఏరియాల వారిగా చూసుకుంటే..:'దసరా' సినిమా టోటల్ ఆంధ్రా, తెలంగాణలో మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక నైజాంలో రూ. 25.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, గుంటూరులో రూ. 2.46 కోట్లు, కృష్ణాలో రూ. 2.46 కోట్లు, నెల్లూరులో రూ. 94 లక్షలతో కలిపి.. రూ. 44.81 కోట్లు షేర్, రూ. 75.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్..:తెలుగు రాష్ట్రాల్లో తోటక్ గా రూ. 44.81 కోట్లు కొల్లగొట్టిన 'దసరా'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. ఇక కర్నాటక అలాగే రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.68 కోట్లు రాగా, వేరే భాషల్లో రూ. 1.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.50 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63 55 కోట్లు షేర్, రూ. 115.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూవీకి టార్గెట్.. ప్రాఫిట్ ఎంత?:నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ లో రూపొందిన 'దసరా' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమా టోటల్ గా క్లొజింగ్ సమయానికి రూ. 63.55 కోట్లు షేర్ అందుకుంది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు రూ. 14.55 కోట్లు లాభాలొచ్చాయి.


Click it and Unblock the Notifications











